GPSతో పెన్షన్ ఉద్యోగులకు చాలా మేలు జరుగుందని తెలిపారు మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల్. GPS రిటైర్మెంట్ సమయంలో ఉద్యోగులకు పూర్తి గ్యారెంటీ ఇస్తుందని మంత్రి చెల్లుబోయిన తెలిపారు. ‘పదవి విరమణ సమయంలో చివరి జీవితంలో బేసిక్ లో 50% పెన్షన్ గా అందుతుంది. అలాగే ఏడాదికి 2 DRలు వస్తాయి.
ఉదాహరణకు చివరి నెల బేసిక్ రూ. లక్ష ఉంటే రూ. 50 వేలు పెన్షన్ వస్తుంది. DRలతో ఇది ఏటా పెరుగుతుంది. 62 ఏళ్లకు రిటైర్ అయిన వ్యక్తికి 82 ఏళ్లు వచ్చేనాటికి నెలకు రూ. 1. 10 లక్షలు పెన్షన్ వస్తుందని వివరించారు మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల్. అమ్మఒడి పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని… ఈనెల 28వ తేదీన అమ్మఒడి పథకం డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. జూన్ 12న విద్యార్థులకు జగనన్న విద్యా కానుక పంపిణీ చేస్తానన్న మంత్రి… జూన్ 16న జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. 3 నుంచి 9వ తరగతి విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు.