ఏపీలో స్కూళ్లకు 3 రోజులు సెలవులు

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర విద్యార్థులకు బిగ్‌ అలర్ట్. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో రేపటి నుంచి మూడు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి. రేపు రెండో శనివారం, 12న ఆదివారం, 13న దీపావళి సెలవు కావడంతో మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి. తోలుత దీపావళి సెలవు నవంబర్ 12న ఉండగా…. ప్రభుత్వం దాన్ని 13వ తేదీకి మారుస్తూ జీవో ఇచ్చింది.

3 days holidays for schools in AP

ఇక అటు రైళ్లలో టపాసులు తీసుకె ళ్లే వారికి రైల్వేశాఖ హెచ్చరికలు జారీచేసింది. రైల్వే స్టేషన్లు, ట్రైన్ లలో క్రాకర్స్ తీసుకెళ్తూ దొరికితే రూ. 1000 ఫైన్ లేదా మూడేళ్ల జైలు శిక్ష ఉంటుందని తెలిపింది. నేర తీవ్రతను బట్టి రెండు ఉండే అవకాశం ఉందని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు. ఎవరైనా అనుమానస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు తీసుకెళుతున్నట్లు కనిపిస్తే 139 హెల్ప్ లైన్ నెంబర్ కు సమాచారం ఇవ్వాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version