తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్క రోజే తిరుమలలో 5 కంపార్టుమెంట్లలో వేచివున్నారు తిరుమల శ్రీవారి భక్తులు. అటు టోకేన్ లేని తిరుమల శ్రీవారి భక్తులకు సర్వదర్శనానికి నిన్న ఒక్క రోజే 4 గంటల సమయం పడుతోంది. అటు నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 58, 278 మంది భక్తులు దర్శించుకున్నారు.
అలాగే నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారికి 17, 220 మంది భక్తులు..తలనీలాలు సమర్పించారు.నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండి ఆదాయం రూ.3.53 కోట్లుగా నమోదు అయింది.
ఇది ఇలా ఉండగా టీడీపీ అధినేత చంద్రబాబు తిరుమలకు వెళ్లారు. తిరుమల పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు ఘనస్వాగతం లభించింది. రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమలకు వెళ్లే దారిలో పలుచోట్ల చంద్రబాబుకు టీడీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. సతీమణి భువనేశ్వరితో కలిసి చంద్రబాబు తిరుమలకు చేరుకున్నారు. రాత్రికి తిరుమలలోనే చంద్రబాబు బసచేశారు. ఉదయం శ్రీవారిని చంద్రబాబు దంపతులు దర్శించుకుంటున్నారు. తిరుమల అతిథి గృహం బయట వేచి ఉన్న కార్యకర్తల వద్దకు చంద్రబాబు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు.