పులి పిల్లలాగా బయట పడతాం : విజయశాంతి ఇంట్రెస్టింట్ ట్వీట్

-

పలు ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ దే అధికారం అని చెప్పడంపై ఆ పార్టీ నేత విజయశాంతి ‘X’లో స్పందించారు. కాలం కొన్ని పరిణామాలను ఎప్పుడూ నిర్దేశిస్తుంది. కోట్లాది తెలంగాణ బిడ్డల జీవితాలు ఎప్పటికీ మంచిగా ఉండాలని…. ఒక ఉద్యమకారిణిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాను.

vijayashanthi on chandrababu arrest

జై తెలంగాణ…జైహింద్’ అని ట్వీట్ చేశారు. ‘పుల్లలమని అంటివి కదరా…. ఇదిగో పులి పిల్లలమై వచ్చినామురా పట్వారి కొడకా’ అనే పాటను జోడించారు. ఐదు రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. ఇందులో రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి, రెండు రాష్ట్రాల్లో బీజేపీకి అవకాశం దక్కుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇక కాంగ్రెస్.. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లలో ముందంజలో ఉండగా.. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో మాత్రం బీజేపీకి పగ్గాలు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. సార్వత్రిక సమరానికి ముందు జరిగిన ఎన్నికలు కావడంతో వాస్తవ ఫలితాల కోసం అన్ని వర్గాలూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version