అన్నమయ్య జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. అన్నమయ్య జిల్లాలో పిడుగుపాటుకు ఏకంగా 42 మూగ జీవాలు మృతి చెందాయి. నిన్న అన్నమయ్య జిల్లాలో భారీ వర్షం కురిసింది. పిడుగులతో పాటు భారీ వర్షం పడింది. ఈ నేపథ్యంలో షెడ్డులో ఉన్న 42 మూగజీవాలు మృతి చెందాయి.

తంబళ్లపల్లెలో బోనసు వారి పల్లికి చెందిన రమేష్ ఇంటి ఆవరణలో పిడుగుపాటుకు అక్కడికక్కడే 42 గొర్రెలు మృతి చెందాయి. సుమారు 5 లక్షల నష్టం కూడా వాటిల్లినట్టు బాధితుడు పేర్కొన్నాడు. ఇది ఇలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు పడతాయని.. అమరావతి వాతావరణ శాఖ స్పష్టం చేసింది. వేటకు వెళ్లేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచనలు కూడా చేసింది.
https://twitter.com/Telugufeedsite/status/1954099966185529668