Delhi wall collapsed: భారత దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి ఇవాల్టి వరకు వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే.. నిన్న పడ్డ కుండపోత వర్షం కారణంగా చాలా కాలనీలు మునిగిపోయాయి. ఈ తరుణంలోనే జైత్పూర్ లో ఇవాళ మధ్యాహ్నం గోడ కూలిపోయింది. ఈ నేపథ్యంలోనే ఏకంగా 8 మంది జనాలు మరణించారు.
మృతుల్లో ఇద్దరు మహిళలు ఉండగా ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మరి కొంతమంది శిథిలాల మధ్య నలిగిపోయారు. ఈ సంఘటన సమాచారం అందగానే… అధికారులు అలాగే పోలీసులు రంగంలోకి దిగారు. సహాయక చర్యలు చేపడుతున్నారు. ఆటో ఈ సంఘటనపై ఢిల్లీ ప్రభుత్వం స్పందించింది. సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయని తెలిపింది.