ఏపీకి మరో 5 కొత్త మెడికల్ కాలేజీలు రానున్నాయి. దేశంలో 2025-26 నుంచి ప్రతి 10 లక్షల జనాభాకు 100 MBBS సీట్ల ప్రాతిపాదికన కొత్త వైద్య కళాశాలలకు అనుమతిస్తామని నేషనల్ మెడికల్ కౌన్సిల్ వెల్లడించింది. దీంతో ఏపీకి మరో ఐదు మెడికల్ కాలేజీలు రానున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే 11 కాలేజీలు ఉండగా, 17 కొత్త కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఐదు కాలేజీలను (విజయనగరం, రాజమండ్రి,ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల) సీఎం జగన్ ప్రారంభించారు.
ఏపీ విద్యార్థులకు అలర్ట్.. ఈ నెల 28 నుంచి సమ్మెటివ్ పరీక్షలు జరుగనున్నాయి. సమ్మేటివ్-1 పరీక్షల షెడ్యూల్ ను పాఠశాల విద్యాశాఖ సవరించింది. 1-5 తరగతులను ఈ నెల 28 నుంచి డిసెంబర్ 5 వరకు, 6-8 తరగతులకు డిసెంబర్ 8 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. తోలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 24 నుంచి పరీక్షలు జరగాల్సి ఉంది. కాగా, ఇంగ్లీష్ సబ్జెక్టులో టోఫెల్ పరీక్షను ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్, స్మార్ట్ టీవీలు ఉన్నచోటే ఈ పరీక్షలు పెడతారు.