మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు అయింది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.
గత నెల 24న నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెంకటాచలం సి.ఐ. సుబ్బారావు రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు వెంకటాచాలానికి చెందిన ఉప్పు పద్మయ్య.
అంతేకాకుండా వెంకటాచలంలో మాజీ జెడ్.పి.టి.సి. వెంకట శేషయ్య పై నమోదైన కేసులో విచారణను అడ్డుకున్నారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు పద్మయ్య. ఇక పద్మయ్య ఫిర్యాదుతో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు అయింది.