ఇవాళ రేవతి కొడుకు శ్రీతేజ్ వద్దకు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ వెళ్లనున్నాడు. నేడు బేగంపేట కిమ్స్ కు రానున్నారు సినీ నటుడు అల్లు అర్జున్. ఈ సందర్భంగా బేగంపేట కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించనున్నాడు సినీ నటుడు అల్లు అర్జున్.
అయితే… ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వస్తే ముందే ఇన్ఫమ్ చేయాలని ఇప్పటికే రాంగోపాల్ పెట్ పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బెయిల్ మీద ఉన్న అల్లు అర్జున్ షరతులు పాటించాలని సూచిస్తున్నారు పోలీసులు. ఈ తరుణంలోనే… ఇవాళ బేగంపేట కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించనున్నాడు సినీ నటుడు అల్లు అర్జున్. ఇవాళ ఉదయం 10 గంటలకు కిమ్స్ వెళ్లనున్నారట అల్లు అర్జున్.