అనకాపల్లి మైనర్ బాలిక హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇంకా దొరకని నిందితుడి ఆచూకీ దొరుకలేదని పోలీసులు చెబుతున్నారు. అయితే.. బాలిక హత్య కేసులో పోలీసుల దర్యాప్తు మాత్రం కొనసాగుతోంది. 12 బృందాలతో గాలింపులు చేస్తున్నారు పోలీసులు. హత్య జరిగి 40 గంటలు గంటలు అయినా ఇంకా దొరకలేదు నిందితుడి ఆచూకీ. ఇలాంటి తరుణంలోనే నిందితుడు రాసిన లేఖ కీలకంగా మారింది.
ఈ హత్యకు కారణాలను బాలిక అన్నయ్యకు లేఖ రాసి సంఘటన స్థలం వద్ద ఉంచాడు నిందితులు సురేష్. దీంతో… నిందుతుడి కాల్ డేటాను సేకరిస్తున్నారు ఏపీ పోలీసులు. విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో ఎవరితో పరిచయాలు ఉన్నాయని కోణంలో విచారణ చేస్తున్నారు ఏపీ పోలీసులు. బెయిల్ మీద బయటకు వచ్చాక అతనితో ఎవరూ మాట్లాడకపోయేసరికి సైకోల ప్రవర్తించేవాడని చెబుతున్నారు గ్రామస్తులు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.