కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కోసం తాము చాలా కష్టపడ్డామని, అందుకు బాధగా ఉందని మంత్రి సీతక్క అన్నారు. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీనా కాదా? అనేది డిసైడ్ చేసుకోవాలి. పార్టీలో ఉన్నప్పుడు పార్టీ లైన్‌లోనే మాట్లాడాలని మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు.
ఇదిలాఉండగా, కాంగ్రెస్ పార్టీ ప్రతీష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే కాగితాలను తీన్మార్ మల్లన్న లైవ్‌లో తగలబెట్టారు. దాని మీద ఉచ్చపోయాలని ఇంతకు ముందు సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.తాజాగా కులగణన సర్వే మీద మరోసారి కామెంట్స్ చేశారు. కుల గణన సర్వే పేపర్లను తగలబెట్టారు. ఉచ్చ పోస్తే తగలబడదు కాబట్టి ఉచ్చ పోయకుండా తగలబెడుతున్నానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మల్లన్న స్పష్టంచేశారు.బీసీ సర్వే తప్పుడు లెక్కలని, బీసీలను కావాలనే తక్కువ చేసి చూపించారని వ్యాఖ్యానించారు.
మల్లన్న కోసం మేము చాలా కష్టపడ్డాం.. అందుకు నాకు బాధగా ఉంది
తీన్మార్ మల్లన్న మా పార్టీనా కాదా అనేది డిసైడ్ చేసుకోవాలి.. పార్టీలో ఉన్నప్పుడు పార్టీ లైన్‌లోనే మాట్లాడాలి – మంత్రి సీతక్క https://t.co/LOzpjJrQhD pic.twitter.com/yjDCNRmftu
— Telugu Scribe (@TeluguScribe) February 5, 2025