సంగారెడ్డి BRS నాయకుల అరెస్టుల పట్ల హరీష్ రావు ఆగ్రహం..!

-

సంగారెడ్డి జిల్లాలో BRS నాయకుల అరెస్టుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసారు మాజీ మంత్రి హరీష్ రావు. నల్లవల్లి, ప్యారానగర్ లో డంపింగ్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న ప్రజలకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. డంపింగ్ యార్డ్ ఏర్పాటు విషయంలో స్థానికుల అభిప్రాయాలను తుంగలో తొక్కుతూ, ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం సిగ్గుచేటు.

రైతులు, స్థానికుల ఆవేదన ఈ ప్రభుత్వానికి ఎందుకు అర్థం కావడం లేదు. ప్రజలను, ప్రజా ప్రతినిధులను అర్ధరాత్రి నుండి ఎందుకు అక్రమ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.. గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి, ప్యారనగర్ గ్రామాల్లో 144 సెక్షన్ విధించి, భయానక వాతావరణం సృష్టించారు అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తున్నారు.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే. మీ పాలనలో ప్రజలు, ప్రజా ప్రతినిధులకు వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పుకునే హక్కే లేదా సీఎం రేవంత్. డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని BRS పక్షాన డిమాండ్ చేస్తున్నాం అని హరీష్ రావ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version