తిరుపతి జిల్లా లో వింత సంఘటన చోటు చేసుకుంది. తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఓ ప్రేమజంట ఆచూకీ కోసం అబ్బాయి అన్నా.. వదినలను బలవంతంగా తీసుకెళ్లారు అమ్మాయి బంధువులు. బాలాయపల్లి మండలం, కడగుంట గ్రామానికి చెందిన పెంచలయ్య, త్రివేణిల మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగింది. గత 3 నెలల క్రితం ఇంట్లో నుండి పారిపోయింది ఈ ప్రేమ జంట. దీంతో బాలాయపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు అమ్మాయి సోదరుడు మహేష్.
ఇరువురూ మేజర్లు కావడం తో కౌన్సిలింగ్ చేసి పంపారు పోలీసులు. కొన్ని రోజుల అనంతరం మళ్లీ పారిపోయింది ప్రేమ జంట. వీరి ఆచూకీ కోసం అబ్బాయి అన్నా వదిన లైన అంకయ్య.. కృష్ణవేణి లను తీసుకెళ్లారు అమ్మాయి బంధువులు. అమ్మాయి తమ్ముడు మహేష్, ఆమె మేనమామలే తీసుకెళ్లారనే ఆరోపణలు వస్తున్నాయి. నాయుడుపేట ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించడంతో అక్కడి పోలీసులకు సమాచారం అందిందట. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.