తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి మరో సంచలనం పోస్ట్ పెట్టారు. సేవ్ తిరువూరు పేరుతో ఈ నెల 30న ర్యాలీ అంటూ పోస్ట్ పెట్టారు ఎమ్మెల్యే కొలికపూడి. తిరువూరు వినాయకుడి గుడి నుంచి రాజు పేట వరకు ర్యాలీ ఉంటుందని ప్రకటించారు ఎమ్మెల్యే కొలికపూడి. రెండు రోజుల క్రితం కూడా అగ్ని పర్వతం బద్దలవ్వక ముందు భయంకరమైన ప్రశాంతంగా ఉంటుందని పోస్ట్ పెట్టిన కొలికపూడి..అందరూ పాల్గొనాలని కోరారు.
ఇక అటు తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు కు మీడియా ప్రతినిధుల ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే మీడియా ప్రతినిధులందరినీ కించపరిచేలా మాట్లాడుతూ బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. కొలికిపూడి పై పెద్దసంఖ్యలో ఫిర్యాదు చేసేందుకు వచ్చారు తిరువూరు స్థానిక మీడియా ప్రతినిధులు. కొలికిపూడి తమను బెదిరిస్తూ కించపరిచిన ఆధారాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందచేశారు మీడియా ప్రతినిధులు. ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని కోరారు ప్రతినిధులు. తనకు అన్ని విషయాలు తెలుసునని సమస్యను త్వరితగతిన పరీష్కరిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు.