తిరుమల శ్రీవారి సన్నిధిలో మరో అపచారం చోటుచేసుకుంది. మరోసారి తిరుమల శ్రీవారి ఆలయ గోపురం పై నుంచి విమానం దూసుకు వెళ్ళింది. ఇలాంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో విపరీతంగా జరుగుతున్నాయి. టీటీడీ అధికారులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన దీనిపై కేంద్ర ప్రభుత్వం…. సరిగ్గా స్పందించడం లేదు. విమాన రాకపోకలు లేకుండా చూడాలని చాలాసార్లు కేంద్రానికి టిటిడి పాలకమండలి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.

అయినప్పటికీ కూడా కేంద్ర విమానయాన శాఖ…. టీటీడీ విజ్ఞప్తిని పట్టించుకోవడం లేదని వార్తలు వస్తున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి గోపురం సమీపం నుంచి విమానం వెళ్లినట్లు గుర్తించారు. విమానయాన శాఖ వైఖరి పై టిటిడి భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం… వ్యక్తం చేస్తున్నారు. కూటమిలో చంద్రబాబు ఉన్నప్పటికీ…. దీనిపై గట్టిగా కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని కొంత మంది భక్తులు నిలదీస్తున్నారు. ఇకనైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని కోరుతున్నారు.
మరోసారి తిరుమల శ్రీవారి ఆలయ గోపురం పై నుంచి వెళ్లిన విమానం
విమాన రాకపోకలు లేకుండా చూడాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసిన టీటీడీ
టీటీడీ విజ్ఞప్తిని పట్టించుకోని కేంద్ర విమానయాన శాఖ
గతంతో పోలిస్తే ఈసారి గోపురం సమీపం నుంచి వెళ్లిన విమానం
విమానయాన శాఖ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం… pic.twitter.com/bh2cqZIOPK
— BIG TV Breaking News (@bigtvtelugu) March 27, 2025
