ఏపీ దేవదాయ శాఖలో మరో దారుణం..మొన్న శాంతి…నేడు వినోద్ కుమార్ !

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర దేవదాయ శాఖలో వరుస కుంభకోణాలు…వెలుగులోకి వస్తున్నాయి. అసిస్టెంట్ కమిషనర్ శాంతి తర్వాత వెలుగులోకి మరో అసిస్టెంట్ కమిషనర్ భూ బాగోతాలు బయటకు వచ్చాయి. ఈ తరుణంలోనే… ఏపీ దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వినోద్ కుమార్ పై కేసు నమోదు చేసింది ఏసీబీ. విశాఖ, విజయనగరం జిల్లాల్లో భారీ ఎత్తున భూకుంభకోణానికి పాల్పడ్డారని వినోద్ కుమార్ పై అభియోగం ఉంది.

A series of scandals are coming to light in Devdaya department

దేవదాయ శాఖ భూములకు నిబంధనలకు విరుద్దంగా ఎన్వోసీలు జారీ చేశాడట వినోద్ కుమార్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట శ్రీ ఓంకారేశ్వర స్వామి దేవస్థానంలో నాగ పడగల ప్రతిష్టలో స్కాంకు పాల్పడిన వినోద్ కుమార్….నాగ ప్రతిష్ట స్కాంలో రూ. 68 లక్షల మేర అవినీతికి పాల్పడ్డాడట. విశాఖ, విజయనగరం జిల్లాల్లో దేవదాయ భూ కుంభకోణాలకు గత ప్రభుత్వ పెద్దలకు సహకరించారని వినోద్ కుమార్ పై ఆరోపణలు ఉన్నాయి. ఇక దీనిపై ఏసీబీ పోలీసులు విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version