సజ్జల భార్గవ్ రెడ్డికి ఏపీ హై కోర్టులో ఎదురుదెబ్బ !

-

సజ్జల భార్గవ్ రెడ్డికి ఏపీ హై కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ సోషల్ మీడియా వింగ్ నేత సజ్జల భార్గవ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లు ఈ నెల 29కి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. సజ్జల భార్గవ్ రెడ్డి తరఫున వాదనలు పూర్తి అయ్యాయి. ఏపీలో పోలీసులు రూలింగ్ పార్టీ ఒత్తిడికి ప్రభావితం అవుతున్నారని కోర్టుకు తెలిపిన పిటిషనర్… వెంటాడి వరుసగా అక్రమ కేసులను పెట్టీ ఇబ్బంది పెడుతున్నట్టు తెలిపారు. ఒక పోస్ట్ పెడితే శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు రాష్ట్రమంతా కేసులు పెడుతున్నారన్న పిటిషనర్….వందల సంఖ్యలో కేసులు పెట్టడం వల్ల అనేక మంది ఇబ్బందులు పెడుతున్నారన్నారు.

Sajjala Bhargav Reddy

సుప్రీం కోర్టు మార్గదర్శకాలు కూడా పక్కన పెడుతున్నారని కోర్టు దృష్టికి తెచ్చిన పిటిషనర్… ప్రస్తుతం 9 కేసులు ఉంటే అవి 90కి మించి పెరిగేలా కేసులు నమోదు ప్రక్రియ ఉందని కోర్టుకు తెలిపారు పిటిషనర్. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ హక్కులను కూడా కాలరాసి అక్రమ కేసులు పెట్టారని వివరించారు పిటిషనర్…. కేసుల నమోదులో ప్రాథమికంగా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. ఆధారాలు సేకరించి కేసులు నమోదు చేస్మనిస్ అసభ్య పోస్టులు పెట్టిన వారు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా కూడా కేసులు నమోదు చేసినట్టు తెలిపింది ప్రభుత్వం. ఇక ఇలాంటి అన్ని కేసుల పిటిషన్లు ఈ నెల 29 విచారణ చేస్తామని వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.

Read more RELATED
Recommended to you

Exit mobile version