బంగ్లాదేశ్‌లో హిందువుల ఊచకోత.. రాహుల్, అఖిలేశ్ యాదవ్ మౌనం వీడాలని కేంద్రమంత్రి ప్రశ్న!

-

భారత్ పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో హిందువులపై ఆ దేశ పౌరులు విచక్షణా రహితంగా దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఇస్కాన్ మెంబర్ చినమోయ్ దాస్ అరెస్టును వ్యతిరేకిస్తూ ఆయన తరఫున వాదించేందుకు సిద్ధమైన ఓ ముస్లిం లాయర్‌ను అక్కడి గుంపు చుట్టుముట్టి హతమార్చింది. దీంతో హిందువులు అంతా ఏకంగా ఆందోళనలు చేపట్టగా బంగ్లాదేశ్ పోలీసులు వారిపై లాఠీచార్జి చేశారు.

దీనికి తోడు మంగళవారం రాత్రి ఓ గుంపు ఇస్కాన్ హిందువులను ఇళ్లళ్లో నుంచి బయటకు లాగి చంపేస్తాం అంటూ బహిరంగంగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీలు చేశారు. ఇస్కాన్ మెంబర్ చినమోయ్ దాస్ అరెస్టుతో చిట్టగాంగ్ అట్టుడుకుతోంది. హిందువులే టార్గెట్‌గా దాడులు జరుగుతున్నాయి. కర్రలు, రాడ్లతో వారిపై దాడులు చేస్తూ హతమారుస్తున్నారు.ఈ క్రమంలోనే బంగ్లాదేశ్‌లోని హిందువులపై జరుగుతున్న దాడులపై స్పందించాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌ని ప్రశ్నించారు. ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు. కాగా, బంగ్లా తాత్కాలిక ప్రధాని యూనస్ ఖాన్ ఆదేశాల మేరకు హిందువులపై దాడులు జరుగుతున్నాయని పెద్దఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version