తిరుమల భక్తులకు అలర్ట్. ఉగాది, శ్రీరామ నవమి రోజున తిరుమలకు వెళ్లే వారికి షాక్. ఏప్రిల్ 9వ తేదిన శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం ఉంటుంది. ఈ సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు చేసింది టిటిడి. ఏప్రిల్ 17వ తేదిన శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం ఉంటుంది. ఈ సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు చేసింది టిటిడి. అటు తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి ఏటిజిహేచ్ అతిధి గృహం వరకు క్యూ లైను వరకు భక్తులు వేచి ఉన్నారు.
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిన్న ఒక్క రోజు 29 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు. ఇక నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 79, 907 మంది దర్శించుకున్నారు. అలాగే.. నిన్న ఒక్క రోజే…తిరుమల శ్రీవారికి 34, 037 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.05 కోట్లుగా నమోదు అయింది. ఇక అటు తిరుమలలో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు మొన్నటితో ముగిసిన సంగతి తెలిసిందే.