నంద్యాల విజయ డైరీ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఈ తరుణంలోనే… ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ అనుచరులు….భారీ సంఖ్యలో వచ్చారు. ఖాళీగా ఉన్న ముగ్గురు డైరెక్టర్లకు ఎన్నికలకు నేడు నామినేషన్ కార్యక్రమం ఉంది. అయితే… నామినేషన్ జరపట్లేదంటూ నిరసన తెలుపుతున్నారు భూమా అఖిలప్రియ వర్గం, ఆమె అనుచరలు. గేట్లు తెరుచుకుని లోపలికి రావటానికి అఖిలప్రియ అను చరులు ప్రయత్నం చేస్తున్నారు.

దీంతో ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ అనుచరులను అడ్డుకున్నారు పోలీసులు. నామినేషన్ల నేపథ్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. భూమా జగత్ విఖ్యాత్ రెడ్డిని సొసైటి అధ్యక్షుడిగా అనర్హత వేటు వేసింది పాలకవర్గం. దీంతో న్యాయం కోసం హైకోర్టు ఆశ్రయించారు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఆసక్తికరంగా మారింది డైరి డైరెక్టర్ల ఎన్నిక.