తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తలపెట్టిన రెండు దేశాల పర్యటన శుభారంభమైంది. ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఉన్నతాధికారులతో కూడిన బృందం సింగపూర్ విదేశాంగ మంత్రి వివియాన్ బాలకృష్ణన్, గారితో విస్తృత చర్చలు జరిపింది.
మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇంధనం, స్థిరమైన హరిత ఇంధనం, నీటి నిర్వహణ, నదుల పునరుజ్జీవనం, పర్యాటకం, విద్య, నైపుణ్యాల అభివృద్ధి, IT పార్కులు తదితర అంశాల్లో విస్తృత సహకారం, దీర్ఘకాలిక భాగస్వామ్యాలపై ముఖ్యమంత్రి గారు దృష్టి సారించారు. సింగపూర్ పర్యటన అనంతరం స్విట్జర్లాండ్ లోని దావోస్ వేదికగా జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటారు.
తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి @revanth_anumula గారు తలపెట్టిన రెండు దేశాల పర్యటన శుభారంభమైంది. ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి @Min_SridharBabu గారు, ఉన్నతాధికారులతో కూడిన బృందం సింగపూర్ విదేశాంగ మంత్రి… pic.twitter.com/3QQB03pn0u
— Telangana CMO (@TelanganaCMO) January 17, 2025