చిత్తూరులో బస్సును ఢీకొట్టిన టిప్పర్..నలుగురు మృతి

-

చిత్తూరు శివారు ప్రాంతం గంగాసాగరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో 4 గురు మృతి చెందారు. తిరుపతి నుంచి మధురై కి వెళ్తున్న బస్సును హైవే వద్ద టిప్పర్ ఢీ కొట్టింది. ఈ నేపథ్యంలోనే..బస్సు బోల్తా కొట్టింది. దీంతో 20 అడుగుల పాటు జారుకుంటూ వెళ్లి రోడ్డు నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో ఉన్న కరెంటు పోల్ బస్సులోకి చొచ్చుకుపోయింది బస్సు.

A tipper hit a bus going from Tirupati to Madurai

దీంతో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ వారిని వేలూరు సియంసీ, నరివి హాస్పటల్ కు తరలించారు పోలీసులు. ఈ తరునంలోనే… ప్రభుత్వాసుపత్రిలో చేరుకున్న కలెక్టర్… ప్రమాద వివరాలు అడిగి తెలుసుకొని, మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఈ సంఘటన పై ఏపీ సర్కార్‌ కు చర్యలు తీసుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news