ప్రియుడి మరో పెళ్లి… 14 వాహనాలు దగ్ధం చేసిన యువతి !

-

విశాఖలో దారుణం జరిగింది. ప్రేమించిన వ్యక్తి మరొకరిని వివాహం చేసుకున్నాడని కోపంతో రగిలిపోయిన యువతి…కోపంలో అపార్ట్మెంట్ సెల్లార్లో పార్కింగ్ చేసిన 14 వాహనాలను దగ్ధం చేసింది. విశాఖ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన జరిగింది. మూడేళ్ల నుంచి ఓ యువకుడిని ప్రేమిస్తోంది యువతి. రెండేళ్ల క్రితం మరో ఆమెను పెళ్లి చేసుకున్నాడు ప్రియుడు. కోపంతో అతడి బైక్ కు నిప్పంటించింది యువతి.

బైకును ఆనుకొని ఉన్న మిగతా బైకులు దగ్ధం అయ్యాయి. ముందుగా ఆకతాయిల పనిగా భావించారు అపార్ట్మెంట్ వాసులు. సీసీటీవీ పరిశీలించగా యువతి పనిగా గుర్తించారు అపార్ట్మెంట్ వాసులు.ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసారు పోలీసులు. అసలు విషయం చెప్పడంతో నిందితురాలని రిమాండ్ కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news