వైసిపి పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ మాజీ పి ఏ అరెస్ట్ అయ్యాడు. మాజీ మంత్రి ధర్మన కృష్ణదాస్ మాజీ పిఏ వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగి మురళిని ఏసీబీ అధికారులు అరెస్టు చేయడం జరిగింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని… ధర్మాన మాజీ పిఏ మురళి పైన అనేక ఆరోపణలు.. రావడం.. జరిగింది.
అయితే ఈ ఆరోపణల నేపథ్యంలో…. ఏసీబీ అధికారులు మురళి ఇంట్లో అలాగే అతని బంధువుల ఇండ్లలో సోదాలు నిర్వహించడం జరిగింది. 20 ఎకరాల భూమి… విశాఖ అటు శ్రీకాకుళం సహా పలు ప్రాంతాల్లో ఫ్లాట్లు కూడా ఉన్నాయట. అంతేకాదు… కిలో బంగారం, 11.36 కిలోల వెండి ఆభరణాలు, ఇతర వస్తువులను గుర్తించారట ఏసీబీ అధికారులు. ఇక వీటి విలువ దాదాపు 50 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఈ వస్తువులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని దానిపైన మురళి సమాధానం ఇవ్వలేకపోయారట. ఈ నేపథ్యంలోనే ధర్మాన మాజీ పీఏ మురళిని అరెస్టు చేశారు పోలీసులు. దీనిపై విచారణ చేస్తున్నారు.