అత్తాకోడళ్ల గ్యాంగ్ రేప్ కేసులో నిందితులు అరెస్ట్..!

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా చిల మత్తురు మండలంలో ఈనెల 12వ తేదీన అర్థరాత్రి అత్తా, కోడల్ పై గ్యాంగ్ రేపు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో హల్ చల్  సృష్టించింది. పండుగవేళ.. ఈ వార్త విన్న వారందరూ నిందితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా  అత్తా కోడళ్ల గ్యాంగ్ రేప్ కేసులో నిందితులు అరెస్ట్ అయ్యారు.

తాజాగా  మీడియా ఎదుట నిందితులను ప్రవేశపెట్టారు జిల్లా ఎస్పీ రత్న. ఘటనకు సంబంధించిన  వివరాలను వెల్లడించారు జిల్లా ఎస్పీ రత్న. నలుగురు నిందితులు అరెస్ట్ కాగా.. మరో ఇద్దరు పరారీ లో ఉన్నట్టు వెల్లడించారు. అయితే ఈ నిందితుల్లో ముగ్గురు మైనర్లు.. మరో ఇద్దరు 20 ఏళ్ల వ్యక్తులు ఉండటం గమనార్హం. ప్రధానంగా  తండ్రి, కొడుకుపై దాడి చేసి.. అత్తా కోడళ్లపై గ్యాంగ్ రేప్ చేశారు ఈ దుండగులు. త్వరలోనే పరారీలో ఉన్న ఇద్దరినీ కూడా పట్టుకుంటామని ఎస్పీ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version