సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణకు ఏఎన్‌యూ గౌరవ డాక్టరేట్‌

-

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేయనుంది. ఈ విషయాన్ని వర్సిటీ ఇన్‌ఛార్జి ఉపకులపతి ఆచార్య పి.రాజశేఖర్‌ వెల్లడించారు. విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి అయిన ఆయనను డాక్టరేట్‌తో గౌరవించాలని వర్సిటీ నిర్ణయించగా.. దానికి ఏపీ సర్కార్ నుంచి, కులపతి హోదాలో గవర్నర్‌ నుంచి ఆమోదం లభించిందని తెలిపారు. ఈ నెల 20న వర్సిటీలో జరిగే 37, 38వ స్నాతకోత్సవంలో ఆయనకు డాక్టరేట్‌ అందజేస్తామన్నారు. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా జస్టిస్‌ ఎన్వీ.రమణను విశ్వవిద్యాలయం ఆహ్వానించింది.

ఆయనకు వర్సిటీ తరఫున గౌరవ డాక్టరేట్‌ ఇవ్వాలని ఈ ఏడాది మార్చి నుంచి పలుమార్లు ప్రయత్నించామని, వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చిందని, ఆ కల ఇప్పుడు నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందని వీసీ అన్నారు. విశ్వవిద్యాలయంలో న్యాయవిద్య అభ్యసించిన మొదటి బ్యాచ్‌ విద్యార్థిగా ఆయనకు గౌరవ డాక్టరేట్‌ ఇవ్వడం సముచితమంటూ.. ఈ అరుదైన అవకాశం వర్సిటీకి దక్కడంపై ఆచార్య రాజశేఖర్‌ ఆనందం వ్యక్తం చేశారు. డాక్టరేట్‌ ఇవ్వనున్న విషయంపై జస్టిస్‌ ఎన్వీ.రమణకు సమాచారం ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. స్నాతకోత్సవానికి ఛాన్స్‌లర్‌ హోదాలో గవర్నర్‌ హాజరవుతారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version