తిరుమల భక్తులకు అలర్ఠ్..ఇవాళ దర్శనాలకు 12 గంటల సమయం పడుతోంది. తిరుమలలో 03 కంపార్టుమెంట్లలో వేచివున్నారు శ్రీవారి భక్తులు. ఇక టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. అటు నిన్న 58607 మంది భక్తులు..తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 19841 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.61 కోట్లుగా నమోదు అయింది.
ఇక అటు తిరుపతిలో వైభవంగా పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఆరవ రోజు ఉదయం సర్వభూపాల వాహనంపై తిరుమాఢ వీధుల్లో విహరిస్తున్నారు పద్మావతి దేవి. నవంబర్ నెలలో తిరుమల శ్రీవారిని 20.35 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారికి హుండీ ద్వారా 111.28 కోట్లు కానుకలుగా సమర్పించారు భక్తులు.
- తిరుమల..03 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
- టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 12 గంటల సమయం
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 58607 మంది భక్తులు
- తలనీలాలు సమర్పిం చిన 19841 మంది భక్తులు
- హుండి ఆదాయం 3.61 కో ట్లు