సంధ్య థియేటర్ వద్ద పుష్ప-2 ప్రీమియిర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయనను చిక్కడపల్లి పోలీస్
స్టేషన్ కు తీసుకువెళ్ళి, స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. గాంధీ ఆసుపత్రికి లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం.. నాంపల్లి కోర్టులో హాజరుపరచగా.. ఇరువైపులా వాదనలు విన్న మేజిస్ట్రేట్ బన్నీకి 14 రోజుల
రిమాండ్ విధించింది.
మరోవైపు చిక్కడపల్లి పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఎర్లు క్వాష్ చేయాలని హైకోర్టు లో బన్నీ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ జరిగింది. కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అల్లు అర్జున్ కి కూడా జీవించే హక్కు ఉందని పేర్కొంది హైకోర్టు. బన్నీ అరెస్ట్ విషయం తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హుటాహుటిన హైదరాబాద్ కు వచ్చారు. ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాద్ కి బయలుదేరారు.