ఆంధ్రప్రదేశ్ లో NDA కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ స్వర్ణాంధ్ర2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన విషయం విధితమే. కలెక్టర్ల సదస్సులో భాగంగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు.
రాజధాని అమరావతి లో విజయవాడ, గుంటూరు నగరాలు క్రమ క్రమంగా కలిసిపోయే వీలు ఉన్నందున ఇప్పటి నుంచే వాటి సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పట్టణీకరణ కూడా పెరుగనున్నందున ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల ప్రాంతాల్లో ప్రజల భవిష్యత్ ను అవసరాలకు వీలుగా భృహత్తర ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. పర్యావరణ అభివృద్ధికై ప్రతీ నెల మూడో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు సీఎం చంద్రబాబు.