బ్రో సినిమాలో తన క్యారెక్టర్ పై కౌంటర్ అటాక్ చేసిన అంబటి

-

బ్రో సినిమాలో అంబటి రాంబాబు పాత్ర ఉందని సోషల్‌ మీడియా ప్రచారం జరుగుతోంది. బ్రో సినిమాలో అంబటి రాంబాబు పాత్రను పృథ్వీ రాజ్‌ చేశాడట. అయితే..బ్రో సినిమాలో తన క్యారెక్టర్ పై కౌంటర్ అటాక్ చేశారు అంబటి. బ్రో సినిమాలో నా క్యారెక్టర్ పెట్టి అవమానించారని విన్నాను… బ్రో సినిమా చూడలేదని వివరించారు.

నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక పవన్ కళ్యాణ్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడని ఫైర్‌ అయ్యారు. ఎవరో డబ్బులు పెట్టి తీసిన సినిమాలో తాను నటిస్తూ నా క్యారెక్టర్ పెట్టి ఆనంద పడుతున్నాడంటూ ఫైర్‌ అయ్యారు. నేను ఎవరి దగ్గరో డబ్బులు తీసుకుని, ప్యాకేజీలు తీసుకుని డ్యాన్స్ వేయనన్నారు.

పవన్ కళ్యాణ్ ది శునకానందం అని.. సంక్రాంతికి నేను వేసిన డ్యాన్స్ ఆనంద తాండవం అంటూ చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన ఆనందం ఇది…. నా డ్యాన్స్ సింక్ అవలేదట… నేను ఏమైనా డ్యాన్స్ మాస్టర్ నా ? అంటూ చురకలు అంటించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు సింక్ అవడంటూ మండిపడ్డారు అంబటి. అబద్దాలు చెబితే లోకేష్ లాంటి కొడుకు పుడతాడంటూ అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version