రాజకీయాల్లో ఎంట్రీపై మరోసారి విశాల్ హాట్ కామెంట్స్

-

ప్రముఖ కోలీవుడ్ నటుడు, నడిగర్‌ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ రాజకీయ రంగ ప్రవేశంపైన మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో విశాల్‌ మాట్లాడారు. రాజకీయాలు సామాజిక సేవకు సంబంధించినవి అని.. ప్రజలకు అవసరమైన సేవలు చేయడమే రాజకీయ నాయకుల ప్రథమ లక్ష్యమని తెలిపారు. రాజకీయం వ్యాపారం కాదని.. అలా చూసుకుంటే.. తాను ఇప్పటికే రాజకీయాల్లోకి వచ్చేసినట్టేనని చెప్పారు. కాబట్టి ప్రత్యేకంగా మళ్లీ పాలిటిక్స్‌లోకి రావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు నటులు అవుతున్నప్పుడు.. నటులు రాజకీయ నాయకులు కావడంలో ఎలాంటి తప్పు లేదని విశాల్ వ్యాఖ్యానించారు.

సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనని నటులను ఉద్దేశిస్తూ విశాల్ మాట్లాడారు. తాను నటించిన సినిమా ప్రమోషన్స్‌కు నయనతార ఎప్పుడూ హాజరు కాలేదని.. అది ఆమె వ్యక్తిగత హక్కు అని తెలిపారు. కాబట్టి, ఈవెంట్స్‌కు రమ్మని ఆమెను బలవంత పెట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కాకపోతే, నిర్మాత సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నటీనటులు సినిమా ప్రమోషన్స్‌కు హాజర్తైతే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version