ఆంధ్ర ప్రదేశ్ లో రాజధాని అంశంపై అనేక ట్విస్ట్‌లు నడుస్తున్న విషయం తెలిసిందే. జగన్ అధికారంలోకి రాగానే, అమరావతి వల్ల ఉపయోగం లేదని, పైగా ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పి జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకున్న విషయం తెలిసిందే.
అమరావతిని శాసనరాజధానిగా మార్చేసి…విశాఖపట్నంని పరిపాలన రాజధానిగా, కర్నూలుని న్యాయ రాజధానిగా చేస్తున్నట్లు రెండేళ్ల క్రితం జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. అయితే రెండేళ్లుగా మూడు రాజధానులపై ముందుకెళ్లలేదు. ఇక ఇటీవలే హై కోర్టు అమరావతినే అభివృద్ధి చేయాలని తీర్పు ఇస్తూ.. రైతులకు శుభవార్త చెప్పింది.
దీంతో అమరావతినే ఏపీ రాజధానిగా మారనుంది. ఈ నేపథ్యంలో ఏపీ రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇన్ని రోజులు సేవ్ అమరావతి పేరుతో ఉద్యమం చేసిన.. రైతులు.. తమ ఉద్యమానికి కొత్త పేరు పెట్టుకున్నారు. ఇక నుంచి “బిల్డ్ అమరావతి” పేరుతో తాము ఉద్యమం చేస్తామని రైతులు ప్రకటన చేశారు. అమరావతి పూర్తి అయ్యే వరకు ఈ పేరుతోనే ఉద్యమం చేస్తామన్నారు.