చంరబాబు.. మీ తల్లిదండ్రులకు తలకొరివి అయినా పెట్టావా..? : జగన్

-

మా కుటుంబంలో వివాదాలు ఉండచ్చు. కానీ చంద్రబాబుకి కూడా కుటుంబం ఉంది కదా అని ప్రశ్నించిన ఏపీ మాజీ సీఎం వైస్ జగన్.. నా చెల్లి షర్మిల మీద చంద్రబాబు బావ మరిది, లోకేష్ మామ బాలకృష్ణ గతంలో తప్పుడు ప్రచారాలు చేయించటం నిజం కాదా అంటూ పేర్కొన్నారు. NBK బిల్డింగ్ నుంచి వెబ్ సైట్స్ నుంచి తప్పుడు ప్రచారం చేయించటం నిజం కాదా.. వర్ర రవీంద్ర రెడ్డి పేరుతో చంద్రబాబు ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి మా అమ్మను, చెల్లిని తిట్టించాడు. ఇది మా ప్రభుత్వ హయంలో జరిగింది అని జగన్ అన్నారు.

సీఎం చంద్రబాబు దారుణమైన నీకృష్ఠుడు. చంద్రబాబు లాంటి రాక్షసుడు అరుదుగా పుడతారు అని తెలిపారు జగన్. అలాగే చంద్రబాబు ఏనాడైనా రాష్ట్ర ప్రజలకు చూపించావా.. తల్లిదండ్రుల తో కలిసి ఎప్పుడైనా ఉన్నావా, మీ ఇంటికి ఎపుడైనా తీసుకు వచ్చావా.. కాలం చేస్తే వారికి తల కొరివి అయినా పెట్టావా అని చంద్రబాబును ప్రశ్నించారు. రాజకీయం కోసం చంద్రబాబు ఏ గడ్డైనా కరుస్తాడు అని అనారోపించారు మాజీ సీఎం.

Read more RELATED
Recommended to you

Exit mobile version