ఓ ఆంబోతు తిరుమలకు వచ్చింది.. భాను ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

తిరుమల తిరుపతి పాలక మండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డిని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ నేతలు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో భాను ప్రకాష్ రెడ్డి  మాట్లాడారు. అతి పెద్ద ధార్మిక క్షేత్రం కలియుగ ప్రత్యక్షం దైవం వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో టీటీడీ బోర్డు మెంబర్ గా నాకు అవకాశం కల్పించినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. గతంలో టీటీడీలో సేవ చేసేందుకు కూటమి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఏపీలో ఆలయాలకు మంచి రోజులు వచ్చాయి.

గత ప్రభుత్వ పాలనలో దేవాలయాలపై దాడులు, విగ్రహాలు మాయం చేసి విధ్వంస ఘటనలు సృష్టించారని ఫైర్ అయ్యారు. పవిత్రత కాపాడుకునేందుకు గతంలో  హైకోర్టుని ఆశ్రయించినట్టు తెలిపారు. గతంలో టీటీడీలో తీసుకున్న నిర్ణయాలను వెబ్ సైట్ లో పొందు పరచలేదని.. ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చారని విమర్శించారు. గత ప్రభుత్వంలో దేవాలయాల నుంచి దోచుకున్న డబ్బును మొత్తం కక్కిస్తాం అన్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version