పోసాని పై పోలీసులకు ఫిర్యాదు చేసిన జనసేన

-

సినీ రచయిత, నటుడు, దర్శకుడు, నిర్మాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పోసాని కృష్ణ మురళీ పై విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు జనసేన నేతలు. వైసీపీ హయాంలో పోసాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని.. అయితే తాము పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని జనసేన అధినేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులను కించపరిచేలా పోసాని మాట్లాడారని మండిపడ్డారు. సోషల్ మీడియా వేదిక గా పోసాని చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గు పడేలా ఉన్నాయన్నారు జనసేన పార్టీ ఆంధ్రజోన్ కన్వీనర్ బాడిత శంకర్.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో వైసీపీ పంచన చెరి సినీ నటుడు పోసాని కృష్ణ మురళీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అని ఫైర్ అయ్యారు. ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబ సభ్యులను కూడా కించపరిచేలా మాట్లాడారు. సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయని మండిపడ్డారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version