కల్వకుంట్ల కవితపై గోనె ప్రకాశరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత సీఎం అవుతుందని ఓ జాతకుడు చెప్పాడంట అంటూ వెల్లడించారు గోనె ప్రకాశరావు. అందుకే కేటీఆర్ కు కవిత పోటీగా మారిందని బాంబ్ పేల్చారు. బీసీల గురించి కవిత మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని తెలిపారు.
పదేళ్లలో బీసీలకు మీరేం చేశారు?అంటూ నిలదీశారు గోనె ప్రకాశరావు. ఈ రోజు బీసీలపై ప్రేమ పుట్టుకొచ్చిందా? అని ప్రశ్నించారు. బీసీలను అడ్డం పెట్టుకుని ధర్నాలు చేయడమా.. సిగ్గులేదా..? అని ఫైర్ అయ్యారు గోనె ప్రకాశ రావు. మరి కల్వకుంట్ల కవితపై గోనె ప్రకాశరావు సంచలన వ్యాఖ్యలు చేయడంపై బీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
కవిత సీఎం అవుతుందని ఓ జాతకుడు చెప్పాడంట : గోనె ప్రకాశరావు
కేటీఆర్ కు కవిత పోటీగా మారింది
బీసీల గురించి కవిత మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది
పదేళ్లలో బీసీలకు మీరేం చేశారు?
ఈరోజు బీసీలపై ప్రేమ పుట్టుకొచ్చిందా?
బీసీలను అడ్డం పెట్టుకుని ధర్నాలు చేయడమా..… pic.twitter.com/qvyKsAxXN0
— BIG TV Breaking News (@bigtvtelugu) January 3, 2025