వైసీపీ పార్టీ నేత, మాజీ మంత్రి విడదల రజినికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మాజీ మంత్రి విడదల రజినిపై అట్రాసిటీ కేసు నమోదు కావడం జరిగింది. ఐటీడీపీకి సంబంధించి సోషల్ మీడియా పోస్టుల విషయంలో గత ప్రభుత్వంలో తనను వేధించిన అంశంలో విడదల రజినిపై కేసు నమోదు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు పిల్లి కోటి.
పిల్లి కోటి పిటిషన్ పరిశీలించి చర్యలు చేపట్టాలని పల్నాడు జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు. ఇక హై కోర్టు ఆదేశాలు నేపథ్యంలో విడదల రజినిపై కేసు నమోదు చేశారు చిలకలూరిపేట పట్టణ పోలీసులు. ఈ తరునంలోనే… మాజీ మంత్రి విడదల రజినిపై అట్రాసిటీ కేసు నమోదు కావడం జరిగింది. అయితే.. ఈ కేసుపై వైసీపీ పార్టీ నేత, మాజీ మంత్రి విడదల రజిని స్పందించాల్సి ఉంది.