పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేసేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు హరి రామ జోగయ్య. జనసేన వారాహి పవన్ కళ్యాణ్ విశాఖ యాత్ర పై మాజీ మంత్రి హరి రామ జోగయ్య విశ్లేషణ చేశారు. తూర్పు పశ్చిమగోదావరి జిల్లాలో వారాహి యాత్ర జన ప్రభంజనం ఎలా అయితే కనిపించిందో అదే రీతిలో విశాఖ యాత్ర కూడా కనిపించబోతుందనేది రాజకీయ పరిశీలకులలో ఆత్రుత కనబడుతోందని వెల్లడించారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పరిపాలనలో మార్పు కోరుకుంటున్న ప్రజలు నీతిపరుడైన పవన్ కళ్యాణ్ అధికారం చేపట్టాలని ఆత్రుతతో ప్రజానీకం ఉన్నారని తెలిపారు.విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ కు రెడ్ కార్పెట్ వేయదలుచుకున్నారని ఊహించుకోవడం ఆశ్చర్య పడాల్సింది లేదని…సెక్రటేరియట్ పరిపాలన ఆఫీసులు విశాఖకు తరలించినంతమాత్రాన అభివృద్ధి సాధ్యమనేది కలలు కనడం మాత్రమే అన్నారు.
నిజమైన అభివృద్ధి అనేది ఉపాధి పెంచడంతో సంపదను పెంచగలిగితే హైదరాబాద్ నగరంలో వంటి ఐటి ఇండస్ట్రీని అభివృద్ధి చేయగలగటం..అనేకమందికి ఉపాధి కల్పించే ఫిలిం ఇండస్ట్రీ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవటం పర్యాటక అభివృద్ధి సాధించటమన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను తరలించిపోకుండా కాపాడుకోవడం కాలుష్య రహిత పరిశ్రమలను స్థాపించుకోవడమని.. ఈ అంశాలపై విశాఖ యాత్రలో పవన్ కళ్యాణ్ అభివృద్ధి ప్రణాళికను ప్రకటించాలి నిజమైన విశాఖ అభివృద్ధి పవన్ కళ్యాణ్ నాంది పలకాలని వెల్లడించారు.