పరారీలో బోరుగడ్డ అనిల్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలోనే…. బోరుగడ్డ అనిల్ కోసం అనంతపురం పోలీసులు గాలిస్తున్నారు. తల్లికి అనారోగ్యం అంటూ డాక్టర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి హైకోర్టులో మధ్యంతర బెయిల్ తీసుకున్నారు బోరుగడ్డ అనిల్. అయితే బోరుగడ్డ అనిల్ నిజంగా చెన్నై ఆస్పత్రికి వెళ్ళారా లేదా అనే దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు.

బోరుగడ్డ సమర్పించిన డాక్టర్ సర్టిఫికేట్ ఫేక్ అని గుర్తించారు పోలీసులు. బోరుగడ్డ అనిల్ ఆచూకీ కోసం చెన్నైకి వెళ్లిన అనంతపురం పోలీసులు… బోరుగడ్డ అనిల్ కోసం గాలిస్తున్నారు. ఇక పరారీలో బోరుగడ్డ అనిల్ గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.