అండమాన్, నికోబార్ దీవులను ‘ ఆసాని’ తుఫాన్ భయపెడుతోంది. అల్పపీడనంగా ఈరోజు తుఫాన్ గా మారే అవకాశం ఉంది. దీంతో అండమాన్, నికోబార్ దీవుల్లో అధికారులు రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. తుఫాన్ ప్రభావంతో అండమాన్ లో సోమవారం భారీ వర్షాలు కురవనున్నాయి. ఈదురు గాలులతో సముద్రం అంతా అల్లకొల్లోలంగా మారింది. తుఫాన్ వల్ల అండమాన్ లో పలు టూరిస్ట్ ప్రాంతాలను మూసివేశారు. లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తత ప్రకటించారు.
ఇదిలా ఉంటే ఈ తుఫాన్ ప్రభావం ఏపీపై కూడా పడనుంది. కొద్ది రోజులుగా ఎండలతో ఇబ్బందుల పడుతున్న ప్రజలకు ఇది కొద్దిగా ఊరట ఇచ్చే విషయం. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల్లో వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాక తెలిపింది. దక్షిణ అండమాన్ లో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారినట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తా,రాయలసీమల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాన్ కారణంగా… ఏపీ వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రత తగ్గి వాతావరణం చల్లబడనున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.