Dr.BR Ambedkar : ఎల్లుండి ఏపీలో భారీ అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణ

-

Dr.BR Ambedkar : ఎల్లుండి ఏపీలో భారీ అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణ కానుంది. విజయవాడ PWD గ్రౌండ్స్ లో ఏర్పాటుచేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైంది. 81 అడుగుల వేదికపై 125 అడుగులతో రూ. 400 కోట్లు నిధులతో దీన్ని నిర్మించారు.

Andhra Pradesh CM to unveil 125-foot-tall Ambedkar statue in Vijayawada on Jan 19

ఇక ఈ నెల 19న సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు. జనవరి 20 నుంచి సందర్శకులకు అనుమతి ఉంటుంది. పర్యాటకులను ఆకట్టుకునేలా లోపల ఆడిటోరియం, కన్వెన్షన్ సెంటర్, మ్యూజియం ఏర్పాటు చేశారు. తొలి రోజు 1.20 లక్షల మంది తరలివస్తారని ప్రభుత్వం భావిస్తోంది.

ఇక అటు ఇవాళ వైసీపీ నాల్గవ జాబితా పై కసరత్తు కొనసాగనుంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో వైసీపీ నాల్గవ జాబితా పై మూడు రోజులు బ్రేక్ పడింది. ఇప్పటికే 59 నియోజకవర్గాల్లో మార్పులు చేసిన వైసీపీ.. మరో ఐదారు నియోజకవర్గాల్లో మార్పుల పై స్పష్టతకు వచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version