2025-26 కు అసెంబ్లీ కమిటీల ప్రకటన

-

ఏపీ అసెంబ్లీ సమావేశాలు  కొనసాగుతున్నాయి. అయితే సమావేశాలు జరుగుతుండగానే కీలక పరిణామం చోటు చేసుకుంది. 2025-26కు ఏపీ అసెంబ్లీ కమిటీలను ప్రభుత్వం ప్రకటించింది. అసెంబ్లీ రూల్స్ కమిటీ చైర్మన్గా అయ్యన్నపాత్రుడు, పిటిషన్ల కమిటీ చైర్మన్గా రఘురామకృష్ణంరాజు, ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్ పితాని సత్యనారాయణ, ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్ గా కామినేని శ్రీనివాస్, ఎథిక్స్ కమిటీ చైర్మన్ మండలి బుద్ధ ప్రసాద్ నియామకమయ్యారు.

ఒక్కో కమిటీలో ఏడుగురు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. ఈ కమిటీలు ఏడాది పాటు పని చేయనున్నాయి. ఎస్సీ వర్గీకరణ పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. జిల్లాల వారిగా జనగణన చేసిన తరువాత ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలుపుదామని.. అలాగే బుడగజంగం వారిని ఎస్సీ ఏ గ్రూపులో కలపాలని ఏకగ్రీవంగా అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news