తిరుమల శ్రీవారి పుణ్యక్షేత్రంలో మరో చిరుత సంచారం కలకలం రేపింది. తాజాగా మరో చిరుత పులి భక్తులకు కనిపించడంతో అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నడకదారి లో ఇవాళ ఉదయం కొందరు భక్తులు వెళ్తుండగా చిరుత పులి కనిపించింది.
దీంతో వారు అక్కడ నుంచి పరుగులు తీశారు. అయితే భక్తుల అరుపులతో చిరుత అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. దీంతో టిటిడి అధికారులు అక్కడ అప్రమత్తమయ్యారు. ఆ చిరుత రాకపై ఆరా తీస్తున్నారు.కాగా, తిరుమల నడకదారిలో రెండు రోజుల క్రితం చిన్నారి లక్షితను చంపిన చిరుత ఎట్టకేలకు చిక్కింది.
ఆ చిరుతను పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు పలుచోట్ల బోనులను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే చివరకు నిన్న అర్ధరాత్రి ఒక బోనులో చిరుతను అధికారులు గుర్తించారు. రెండు రోజులుగా ఐదు ప్రాంతాలలో చిరుత సంచారానికి గుర్తించి బోనులు ఏర్పాటు చేయగా… ఎట్టకేలకు చిన్నారిపై దాడి చేసిన ప్రాంతానికి సమీపంలోనే ఆ చిరుత చిక్కింది.