వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు వర్రా రవీంద్రారెడ్డి సజ్జల భార్గవరెడ్డి అర్జున్ రెడ్డిలకు మరో షాక్ ఇచ్చారు ఏపీ పోలీసులు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు వర్రా రవీంద్రారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి ల పై మరో ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అసభ్యకర పోస్టులు తొలగించాలని కోరగా కులం పేరుతో దూషిస్తూ చంపుతామని బెదిరించారంటూ వెంకటాద్రి ఫిర్యాదు చేయడం జరిగింది.
సిద్ధవటం మండలం ఎస్ రాజంపేట గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త వెంకటాద్రి ఈనెల 8వ తేదీన ఫిర్యాదు చేశారు. దీంతో సిద్ధవటం నుంచి పులివెందులకు కేసు బదిలీ చేశారు. ఇందులో భాగంగానే… వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు వర్రా రవీంద్రారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి ల పై మరో ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు.