BIG BREAKING : అవినాశ్ రెడ్డికి సుప్రీంలో చుక్కెదురు అయింది. ముందస్తు బెయిల్ కోసం అవినాశ్ రెడ్డి..నిన్న సుప్రీం కోర్టు ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ పిటీషన్ పై విచారణ చేసిన సుప్రీం కోర్టు… అవినాశ్ రెడ్డికి షాక్ ఇచ్చింది.
అవినాశ్ ముందస్తు బెయిల్ పై జోక్యానికి సుప్రీం నిరాకరించింది. హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్న సుప్రీంకోర్టు… 25న హైకోర్టు వెకేషన్ బెంచ్ అవినాశ్ ముందస్తు బెయిల్‌పై విచారణ జరపాలని పేర్కొంది. అంతవరకూ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా సిబిఐకి అదేశాలు ఇవ్వడానికి నిరాకరించింది సుప్రీం కోర్టు. తన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారించాలని కోరే హక్కు పిటిషనర్ కు ఉందని పేర్కొంది సుప్రీం. ఇక జస్టిస్ జె కే మహేశ్వరి, జస్టిస్ పి. నరసింహ ధర్మాసనం ఈ విచారణ జరిపింది.