ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్. మార్చి 21వ తేదీ నుంచి ఏపీ పదో తరగతి పరీక్షలు జరుగనున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలను మార్చి ఒకటో తేదీన నిర్వహించాలని ఇంటర్మీడియట్ విద్య మండలి ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ప్రాక్టికల్స్, ఒకేషనల్, మరియు ఫైనల్ థియరీ ఎగ్జామ్స్ లను మార్చి 20వ తేదీలోపు పూర్తిచేసేలా షెడ్యూల్ రూపొందించారు.
ఈ షెడ్యూల్ ప్రకారం 21వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి అన్నమాట. సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ మార్చ్ మాసంలో వచ్చే అవకాశం ఉన్నందున పరీక్షల షెడ్యూల్ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తో అధికారులు చర్చిస్తున్నారు. పదవ తరగతి పరీక్షలలో సామాన్య శాస్త్రానికి రెండు పేపరు ఉండటంతో ఏడు పేపర్లతో పరీక్షలు నిర్వహించనున్నారు. ఒక పరీక్ష పూర్తయిన మరుసటి రోజు సెలవు ఇవ్వాలా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది.