లిక్కర్, బీర్ల తయారీకి అనుమతి..

-

కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్ డౌన్‌తో వైన్ షాపులే మూతపడటమే కాకుండా, మద్యం తయారీ కూడా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మే 17 వరకు లాక్ డౌన్ పొడిగించిన కేంద్రం పలు సడలింపులు ప్రకటించింది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం అమ్మకాలకు కేంద్రం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గ దర్శకాలకు లోబడి.. దేశీయ లిక్కర్, బీర్ల తయారీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని వెల్లడించింది.

అయితే మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు వెలుపల ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోని కంపెనీలు మాత్రమే మద్యం తయారు చేసేందుకు అనుమతిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లలోని మద్యం తయారీదారులకు ఈ ఉత్తర్వుల వర్తిస్తాయని పేర్కొంది. అయితే మద్యం తయారు చేసే సమయంలో కార్మికులు భౌతిక దూరం నిబంధనను తప్పక పాటించాలని ఆదేశించింది. అయితే పరిస్థితులను బట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసే మార్గదర్శకాలకు లోబడి కంపెనీలను నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ఏపీ ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలు
కార్మికులకు ప్రత్యేక రవాణా సదుపాయం ఏర్పటు చేయాలి.
ఆ వాహనాల్లో కూడా కేవలం 30 నుంచి 40 శాతం సామర్థ్యం వరకే కార్మికులను అనుమతించాలి.
అలాగే వాటిని నిత్యం డిస్ఇన్ఫెక్షన్ చేయాలి.
కార్మికులకు హ్యాండ్ వాష్, శానిటైజర్‌లు ఏర్పాటు చేయాలి.
షిప్ట్‌లకు మధ్య కనీసం గంట సేపు గ్యాప్ ఉండేలా చూసుకోవాలి.
కార్మికులను విడతల వారీగా లంచ్‌కు పంపాలి.

Read more RELATED
Recommended to you

Latest news