ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకోనుంది. నేడు అసెంబ్లీలో గ్రూప్ ఫోటో సెషన్ ఉండనుంది. ఇవాళ ఉదయం 11 గంటల తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు గ్రూప్ ఫోటో ఉండనుంది. ఇక మధ్యాహ్నం మూడు గంటలకు సాధన సభ్యులకు క్రీడా పోటీలు కూడా ఉంటాయి. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు చేసింది ఏపీ సర్కార్.
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో క్రీడా పోటీలు ఉండనున్నాయి. ఈ క్రీడా పోటీలను ఏపీ స్పీకర్ అలాగే మండలి చైర్మన్ ఇద్దరు ప్రారంభిస్తారు. 13 రకాల క్రీడాలలో ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు పాల్గొంటారు. క్రీడా పోటీలకు 140 మంది ఎమ్మెల్యేలు అలాగే 13 మంది ఎమ్మెల్సీలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.