సీఎం చంద్రబాబు చాలా పెద్ద మాటలు మాట్లాడారు. ప్రజలు గతం మర్చిపోయి ఉంటారని అనుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను ఎలా మభ్యపెట్టవచ్చనే విజన్ తో చంద్రబాబు ఉంటారు అని మాజీమంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. నిజాయితీ లేకుండా ఉంటే ప్రజలకు మేలు జరగదు. గతంలో 2020 చూశాం.. 2029 చూశాం.. ఇప్పుడు 2047 చూస్తున్నాం. గతంలో చెప్పిన మాటలనే మళ్ళీ మళ్ళీ చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారు.. అదే విధంగా ఆయనను ఆయనే మోసం చేసుకుంటున్నారు. మాయమాటలు, మభ్యపెట్టే మాటలను ప్రజలు గమనిస్తున్నారు.
ప్రజలకు కావల్సింది 2047 కాదు 202.. రాష్ట్రం గురించి తెలియని వాళ్లతో విజన్ డాక్యుమెంట్స్ తయారు చేయిస్తున్నారు. ఏపీలో విద్యా, వైద్యం ప్రైవేట్ పరం కావటానికి మీరు ఒక కారణం కాదా.. వైఎస్ఆర్ హయాం నాటి నుంచి ఇప్పటి వరకు కస్తూరిబా స్కూల్స్ , మోడల్ స్కూల్స్ వందలు కట్టాం. చంద్రబాబు విజన్ వల్లే మధ్యతరగతి పరిశ్రమలు దెబ్బతిన్నాయి. హైదరాబాద్ లో ఐటీ పరిశ్రమ ఉందంటే వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ ఒక్కటే ప్రధాన కారణం. చంద్రబాబు సీఎం కుర్చీ నుంచి దిగాక ఐదుగురు ముఖ్యమంత్రులు మారారు.. ఇప్పటికీ హైదరాబాద్ లో అంతా నేనే చేశానని చెప్పుకుంటున్నారు అని సాకే శైలజానాథ్ అన్నారు.