పింఛన్ దారులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్ దారులకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం అని పేర్కొన్నారు. “మీకు అండగా నిలుస్తూ, సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటయింది. మెనిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్ ను ఒకేసారి రూ. వెయ్యి పెంచి ఇస్తున్నామన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.
దివ్యాంగులకు పింఛన్ రూ. 6వేలు ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. జులై 1 నుంచే పెంచిన పింఛన్లు ఇంటి వద్ద అందిస్తాం. ఎన్నికల సమయంలో మూడు నెలలు మీ కష్టాలు చూసి చలించిపోయాను. మండుటెండలో, వడగాడ్పుల మధ్య మీరు పడిన ఆగచాట్లు చూసా. ఏప్రిల్ నెల నుంచి పింఛన్ పెంపును వర్తింపజేస్తానని మాట ఇచ్చా. ఏప్రిల్, మే, జూన్ నెలలకు పెంపును వర్తింపజేసి మీకు అందిస్తున్నాం” అని లేఖలో పేర్కొన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.